'రాములో రాములా' టిక్ టాక్ వైరల్... తమన్ కు నచ్చిన వీడియో!

Mon, Oct 28, 2019, 12:48 PM
  • అల్లు అర్జున్ హీరోగా 'అల వైకుంఠపురములో'
  • నిన్న విడుదలైన పాట
  • టిక్ టాక్ చేసిన పల్లెటూరి జంట
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా, ఈ చిత్రం విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా, నిన్న దీపావళి కానుకగా, 'రాములో రాములా' అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ఆపై గంటల వ్యవధిలోనే వైరల్ అయింది. లక్షల వ్యూస్ తెచ్చుకుంది. ఈ పాట లిరిక్స్ ను వేలాది జంటలు టిక్ టాక్ చేశాయి. వాటిల్లో ఒకటి సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ కు తెగనచ్చేసింది. ఆయన దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో అది మరింత వైరల్ అయింది. పొలాల మధ్య, ఓ పల్లెటూరి జంట ఈ పాటను టిక్ టాక్ చేసింది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement