Allu Arjun: విలన్ గా బన్నీతో తలపడనున్న విజయ్ సేతుపతి?

  • త్రివిక్రమ్ సినిమాను పూర్తిచేస్తున్న బన్నీ 
  • త్వరలో సుకుమార్ తో సెట్స్ పైకి 
  • తమిళంలోనూ రిలీజ్ చేయాలనే ఆలోచన

ప్రస్తుతం త్రివిక్రమ్ చేస్తున్న 'అల వైకుంఠపురములో' సినిమా షూటింగుతో అల్లు అర్జున్ బిజీగా వున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకుంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, బన్నీ తదుపరి సినిమాకి సన్నాహాలు జరిగిపోతున్నాయి.

బన్నీ తదుపరి సినిమా సుకుమార్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా వుంటుందట. ఈ పాత్రకి గాను తమిళ హీరో విజయ్ సేతుపతిని తీసుకోనున్నట్టు సమాచారం. తమిళనాట విజయ్ సేతుపతికి మంచి క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. అందువలన తమిళంలోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేసుకోవచ్చనే ఆలోచనలో వున్నారు. ఆ ఉద్దేశంతోనే ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు.

More Telugu News