america: బాగ్దాదీ మృతితో కథ ముగిసినట్లు కాదు: అమెరికా

  • దేశ చరిత్రలో ఇది ఒక గొప్ప రోజు
  • ఐసిస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది
  • ఆ ఉగ్ర సంస్థ మూలాలను తుడిచిపెట్టాల్సి ఉంది

ఐసిస్ అగ్ర నేత అబూ బకర్ అల్ బాగ్దాదీ మృతితో కథ ముగిసినట్లు కాదని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఆ ఉగ్ర సంస్థ మూలాలను తుడిచిపెట్టాల్సిన అవసరం ఉందని అమెరికా తెలిపింది. ప్రపంచానికి ప్రమాదకరంగా పరిణమించిన ఉగ్రసంస్థని తుడిచిపెట్టే ప్రక్రియలో అతడిని హతమార్చడం గొప్ప విజయమని చెప్పింది. అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్ ఎస్పర్ మీడియాతో మాట్లాడుతూ.... తమ దేశ చరిత్రలో ఇది ఒక గొప్ప రోజుగా అభివర్ణించారు.

ఈ ఆపరేషన్ లో పాల్గొన్న సైన్యంపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచాన్ని బెదిరించడానికి యత్నించిన ఉగ్రవాద నేత తన చివరి క్షణాల్ని భయంతో గడిపాడని అమెరికా రక్షణశాఖ సలహాదారు రాబర్ట్ ఓబ్రియెన్ తెలిపారు. బలగాలు అతనిపై దాడి చేస్తోంటే వణికిపోయాడని చెప్పారు. తమ దేశానికి ఐసిస్ ముప్పులా పరిణమించిందని తెలిపారు. కాగా, ఐసిస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీ మృతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ధారించిన విషయం తెలిసిందే. సైనిక దాడుల సమయంలో అతడు ఆత్మాహుతికి పాల్పడ్డాడని ఆయన వెల్లడించారు.

More Telugu News