రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'బిగిల్'

Mon, Oct 28, 2019, 10:23 AM
  • ఈ నెల 25న వచ్చిన 'బిగిల్'
  • తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకి పైగా వసూళ్లు
  • ఓవర్సీస్ లోను అదే దూకుడు 
తమిళనాట మాస్ హీరోగా విజయ్ కి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. ఎప్పటికప్పుడు ఆయన తన సినిమా వసూళ్లతో పాటు క్రేజ్ ను కూడా పెంచుకుంటూ వెళుతున్నాడు. దీపావళి కానుకగా ఈ నెల 25న విడుదలైన 'బిగిల్' కూడా అదే తరహాలో తన జోరు చూపిస్తోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే ఈ సినిమా 120 కోట్లను రాబట్టడం విశేషం. ఇంతకుముందు విజయ్ చేసిన 'సర్కార్' రెండు రోజుల్లో 100 కోట్లను సాధించగా, 'బిగిల్' ఆ మార్కును క్రాస్ చేసి ఆశ్చర్యచకితులను చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో 10 కోట్లకి పైగా వసూలు చేసిన ఈ సినిమా, ఓవర్సీస్ లోను అదే దూకుడు చూపుతోంది. ఈ రోజు నుంచి ఈ సినిమాకి లభించే ఆదరణను బట్టి, సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకోనుందనేది తెలుస్తుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement