బైక్ నడుపుతున్న కుక్క... వైరల్ అవుతున్న వీడియో ఇదిగో!

28-10-2019 Mon 08:34
  • ట్రిపుల్ రైడింగ్ చేసిన శునకం
  • దర్జాగా హ్యాండిల్స్ పట్టుకుని నడుపుతున్న కుక్క
  • హెల్మెట్ పెట్టుకోలేదని నెటిజన్ల కామెంట్లు
చానాళ్ల క్రితం ఓ శునకం బైక్ నడుపుతున్న వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ శునకం దాన్ని మించిపోయింది. అప్పటి కుక్క డబుల్ రైడింగ్ చేస్తే, ఈ కుక్క ఏకంగా ట్రిపుల్ రైడింగ్ చేసింది. ఈ ఘటన బ్రెజిల్ లో జరిగినట్టు తెలుస్తుండగా, ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. వీడియో మాత్రం వైరల్ అవుతోంది. నేషనల్ హైవేపై, దాని యజమాని, మరొకరు వెనుక కూర్చుని ఉండగా, ఈ శునకం దర్జాగా బైక్ హ్యాండిల్స్ పట్టుకుని, ముందు కూర్చుని బైక్ ను నడుపుతోంది. ఈ వీడియోను జో బర్గ్ అనే యువతి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. కుక్కకు హెల్మెట్ ఎక్కడుందని కొందరు, ఈ తరహా పిచ్చి పనులు చేయవద్దని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.