Manchu Vishnu: మంచు విష్ణు నివాసంలో ప్రభాస్ అల్లరి... ఫొటోలు ఇవిగో!

  • మంచు విష్ణు నివాసంలో దీపావళి వేడుకలు
  • మంచు విష్ణుతో ప్రభాస్ సరదాలు
  • ఫొటోలు వైరల్

టాలీవుడ్ హీరోలు మంచు విష్ణు, ప్రభాస్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా మంచు విష్ణు తన నివాసంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేయగా హీరో ప్రభాస్ కూడా విచ్చేశాడు. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం ప్రారంభం కాగా, తెల్లవారుజాము వరకు ప్రభాస్ తో సరదాలు, సంతోషాలు కొనసాగాయని మంచు విష్ణు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో విష్ణు, ప్రభాస్ లతో పాటు విరానికా కూడా ఉన్నారు.

More Telugu News