brain: అధిక ఉప్పు తీసుకుంటే బీపీయే కాదు.. 'డిమెన్షియా' ప్రమాదం కూడా!

  • ఉప్పు మోతాదు మించితే మెదడులో నైట్రిక్‌ ఆక్సైడ్‌ లోపం 
  • మెదడులోని నాడీ కణాల పనితీరుపై ప్రభావం 
  • జ్ఞాపకశక్తి తగ్గి డిమెన్షియా

ఉప్పు లేనిదో కూరలకు రుచిరాదు. అది లేని చప్పటి తిండిని తినలేం. అయితే, కొందరు ఆహార పదార్థాల్లో ఉప్పును అధికంగా వాడుతుంటారు. దీన్ని పరిమితికి మించి వాడినా, పరిమితికంటే తక్కువగా వాడినా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోకతప్పదు. ఉప్పు అధికంగా వాడితే  బీపీ పెరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే, దీన్ని ఎక్కువగా తీసుకుంటున్నవారిలో డిమెన్షియా కూడా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

ఆహారంలో ఉప్పు మోతాదు మించడం వల్ల మెదడులో నైట్రిక్‌ ఆక్సైడ్‌ లోపం ఏర్పడుతుందని పరిశోధకులు తెలిపారు. దీంతో మెదడులోని నాడీ కణాల పనితీరుపై ప్రభావం పడుతుందని, జ్ఞాపకశక్తి తగ్గి డిమెన్షియాకు దారితీస్తుందని వివరించారు. అంతేగాక, అల్జీమర్స్‌ కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఉప్పును మితంగానే తీసుకోవాలని సూచించారు.

More Telugu News