అమెరికాకు చిక్క కూడదని... ఆత్మహత్య చేసుకున్న ఐసిస్ చీఫ్ బాగ్దాదీ!

27-10-2019 Sun 11:18
  • సిరియాలో చుట్టుముట్టిన అమెరికన్ సైన్యం
  • చిక్కకూడదని భావించిన అల్ బాగ్దాదీ
  • ఆత్మహత్య చేసుకున్నాడన్న యూఎస్ మీడియా
అమెరికన్ సైనికులు చుట్టుముట్టిన వేళ, వాళ్లకు చిక్కరాదన్న ఉద్దేశంతో ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ, ఆత్మహత్య చేసుకున్నట్టు యూఎస్ మీడియా ఈ ఉదయం ప్రత్యేక కథనాలను ప్రచురించింది. సిరియాలోని ఉగ్రవాదుల స్థావరాలపై అమెరికన్ సైన్యం దాడులు చేసేందుకు ట్రంప్ అనుమతించిన తరువాత, ఐసీస్ కీలక ప్రాంతాలను సైన్యం చుట్టుముట్టింది. ఈ నేపథ్యంలో అమెరికన్ సైన్యం దగ్గరకు వచ్చిందని తెలుసుకున్న అల్ బాగ్దాదీ, ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. సిరియా, ఇరాక్ దేశాల్లో సొంత ఇస్లామిక్ రాజ్యాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో అల్ బాగ్దాదీ, ఐసిస్ ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇక, అల్ బాగ్దాదీ చంపబడ్డాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న విషయమై పూర్తి స్పష్టత రాలేదు.