Two Wheeler: హోండా యాక్టివా కొన్నాడు... బస్తాల్లో డబ్బులు తెచ్చిచ్చాడు!

  • మధ్యప్రదేశ్ లో టూ వీలర్ కొన్న రాకేశ్
  • రూ. 5, రూ. 10 నాణాలను తెచ్చిచ్చిన వైనం
  • లెక్కించేందుకు మూడు గంటలకు పైగా సమయం

పండగ సీజన్ లో ఏదో ఒక కొత్త వస్తువు కొనుగోలు చేయాలని అందరూ భావిస్తుంటారు. అది కూడా కాస్తంత ఖరీదైన వస్తువే కొనాలని అనుకుంటారు. కారు గానీ, బైక్ గానీ, బంగారం కానీ కొంటుంటారు కూడా. మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాకు చెందిన రాకేశ్ కుమార్ గుప్తాకు కూడా ఓ వస్తువు కొనాలని అనిపించింది. హోండా కంపెనీకి చెందిన యాక్టివా టూ వీలర్ ను కొనాలని భావించాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, బైక్ ను కొనేందుకు బస్తాల్లో డబ్బులు తీసుకెళ్లాడు. అదేంటనుకుంటున్నారా..?

బైక్ ఖరీదు రూ. 83 వేలు. ఇందులో వింతేమీ లేదు. కానీ, రాకేశ్ మాత్రం కేవలం రూ. 5, రూ. 10 నాణాలను బస్తాల్లో తీసుకెళ్లి, మొత్తం రూ. 83 వేలు చెల్లించడంతోనే షోరూమ్ నిర్వాహకులు అవాక్కయ్యారు. దాదాపు మూడు గంటలకు పైగా శ్రమించిన సిబ్బంది, వాటిని లెక్కగట్టారు. రాకేశ్ ఎన్నేళ్ల నుంచి వీటిని సేకరించి పెట్టుకున్నాడో తెలియదుగానీ, ఇప్పుడీ ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి.

More Telugu News