Srisailam: శాంతించిన కృష్ణమ్మ... శ్రీశైలం 4 గేట్ల మూసివేత!

  • ఎగువన తగ్గిన వర్షాలు
  • ఆరు నుంచి 3 లక్షల క్యూసెక్కులకు తగ్గిన వరద
  • రెండు రోజుల్లో గేట్ల మూసివేత

కర్ణాటకలో వర్షాలు తగ్గడంతో, శ్రీశైలానికి వస్తున్న వరద గణనీయంగా తగ్గింది. ఐదు రోజులుగా సగటున ఆరు లక్షల క్యూసెక్కులకు పైగా వస్తున్న వరద, ఇప్పుడు మూడు లక్షలకు తగ్గటంతో, కృష్ణమ్మ శాంతించినట్లయింది. దీంతో నిన్నటివరకూ తెరచివుంచిన డ్యామ్ 10 క్రస్ట్‌ గేట్లలో నాలుగు గేట్లను అధికారులు దించేశారు. నిన్నటివరకూ 24 అడుగుల తెరచుకున్న గేట్లను, 4 అడుగుల మేరకు దించి, 20 అడుగుల మేరకే తెరచివుంచారు. నిన్నటి నుంచి వరద క్రమంగా తగ్గిందని, అందువల్లే, శనివారం ఉదయం 2 గేట్లను, సాయంత్రం మరో రెండు గేట్లను మూసివేశామని అధికారులు తెలిపారు. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉందని, వచ్చిన నీరు వచ్చినట్టు దిగువకు వదులుతున్నామని వెల్లడించారు. మంగళ లేదా బుధవారాల్లో గేట్లను పూర్తిగా మూసివేయవచ్చని, ఆ సమయంలో వచ్చే వరద విద్యుత్ ఉత్పత్తికి, కాలువలకు పంపేందుకు సరిపోతుందని భావిస్తున్నట్టు తెలిపారు. 

More Telugu News