KCR: ఇక 'నాగార్జున సాగర్' ఆయకట్టుపై దృష్టి సారిస్తా: సీఎం కేసీఆర్

  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటి సమస్యలను తొలగిస్తామన్న కేసీఆర్
  • నీటిపారుదల లిఫ్టుల నిర్వహణ వ్యయాలను ప్రభుత్వమే భరిస్తుందని హామీ
  • గోదావరి నీళ్లతో సాగర్ ఎడమ కాల్వ పునీతం కావాలని ఆకాంక్ష

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ విజయం సాధించిన సందర్భంగా  ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటి సమస్యలను తొలగిస్తామని చెప్పారు. అనేక అవమానాలు ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నామని, ఎన్నో లక్ష్యాలతో పనిచేస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని, తెలంగాణలో కోటీ 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందన్నారు.

‘నాగార్జున సాగర్ ఆయకట్టుపై దృష్టి సారిస్తా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి సమస్యలు శాశ్వతంగా తొలగిపోవాలి. గోదావరి నీళ్లతో సాగర్ ఎడమ కాల్వ పొంగిపొర్లాలి. రైతులతో కలిసి ఈ ప్రాంతంలో పర్యటించి నీటి కష్టాలను తొలగిస్తాం. ఐడీసీ, నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న దాదాపు 600 లిఫ్టుల నిర్వహణ వ్యయాలను ప్రభుత్వమే భరిస్తుంది. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, మహబూబ్ నగర్ లో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాల్సి ఉంది. అప్పుడే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది’ అని కేసీఆర్ అన్నారు.

అంతకు ముందు తన ప్రసంగంలో కేసీఆర్ హుజూర్ నగర్ నియోజక వర్గ వాసులపై వరాల జల్లు కురిపించారు. సైదిరెడ్డిని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News