Pakistan: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు గుండెపోటు

  • ప్రాణాపాయం తప్పిందన్న వైద్యులు 
  • చౌదరీ షుగర్ మిల్స్ కేసులో జైలుపాలయిన నవాజ్
  • అనారోగ్యం దృష్ట్యా బెయిలిచ్చిన లాహోర్ హైకోర్టు

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గుండెపోటుకు గురయ్యారు. ఈ మేరకు ఆ దేశ పాత్రికేయుడు హమీద్ మీర్ వెల్లడించారు. ‘అనారోగ్యంతో సర్వీసెస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కు  ఈ రోజు గుండెపోటు వచ్చింది. ప్రమాదం నుంచి షరీఫ్ బయటపడ్డాడని వైద్యులు చెబుతున్నప్పటికీ, ఆయన బలహీనంగా కన్పిస్తున్నారు’ అని మీర్ తెలిపారు.

చౌదరీ షుగర్ మిల్స్ కేసులో జైలుపాలై విచారణ ఎదుర్కొంటున్న షరీఫ్ ఆరోగ్యం గురువారం క్షీణించడంతో చికిత్సకోసం ఆయనను సర్వీసెస్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం షరీఫ్ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని లాహోర్ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ.. 10 మిలియన్ల పీకేఆర్ (పాకిస్తాన్ రూపీలు) ల విలువైన రెండు సెక్యూరిటీ బాండ్లను పూచీకత్తుగా సమర్పించాలని ఆదేశించింది.

More Telugu News