Donald Trump: ఐఫోన్ లో స్వైప్ కంటే బటన్ ఉంటేనే అనుకూలం: ట్రంప్ సలహా

  • యాపిల్ సీఈవో టిమ్ కుక్ కు ట్వీట్
  • రెండేళ్ల క్రితం ఐఫోన్ డిజైన్ మార్పుతో ఇబ్బందిగా ఉంది
  • పాత డిజైనే ఉత్తమమన్న అధ్యక్షుడు

ఐఫోన్ ఉపయోగించడంలో తనకు చిన్న ఇబ్బంది కలుగుతుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ఫోన్ తయారీదారు యాపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ కు ట్వీట్ చేశారు. ‘టిమ్, ఐఫోన్ లో స్వైప్ కంటే బటన్ ఉంటేనే అనుకూలంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.

2017 లో విడుదల చేసిన ఐఫోన్ 10 లో యాపిల్ చిన్న మార్పు చేసింది. కొన్ని ఐఫోన్ మోడళ్లలో హోం బటన్ ను తొలగించింది. దీంతో హోం స్క్రీన్ కు రావాలంటే యూజర్ ప్రతీసారి స్క్రీన్ ను స్వైప్ చేయాల్సి వస్తోంది. ఈ మార్పు వల్ల దీన్ని ఉపయోగిస్తున్న సాధారణ వినియోగదారులే కాక డొనాల్డ్ ట్రంప్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టిమ్ కు ట్వీట్ చేశారు. బటన్ ఉంటేనే ఐఫోన్ ఉపయోగించడం సులువని తెలిపారు.

More Telugu News