Vithalacharya: విఠలాచార్య ఆ సినిమాకి తనపేరు వేయకుండా వుంటే బాగుండేదన్నాడట

  • జానపద చిత్రాల ద్వారా మంచి పేరు 
  • ఎన్నో విజయాలను అందుకున్న విఠలాచార్య 
  • ఆయన విమర్శలను పట్టించుకోరన్న ఈశ్వర్

రచయిత -  సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ, దర్శకుడు విఠలాచార్య గురించి ప్రస్తావించారు. విఠలాచార్యగారు జానపద బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ .. కాంతారావు గార్లతో ఆయన తెరకెక్కించిన జానపదాలు విజయవంతమయ్యాయి. అయితే అక్కినేని నాగేశ్వరరావుగారితో సినిమా చేయకపోవడం ఒక వెలితిగా ఉందనే ఉద్దేశంతో ఆయన 'బీదలపాట్లు' అనే సాంఘిక చిత్రాన్ని రూపొందించారు.

విఠలాచార్య సాంఘిక చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండటం అప్పట్లో ఇండస్ట్రీలోని చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. విమర్శలను లెక్కచేయకుండా ఆయన ఆ సినిమాను పూర్తిచేశారు. విడుదలైన తరువాత ఆ సినిమా పరాజయం పాలైంది. ఆయనని కలిసినప్పుడు నేను ఆ సినిమాను గురించి ప్రస్తావించాను. అందుకు అయన స్పందిస్తూ .. "నేను చేసిన పొరపాటు ఏమిటంటే దర్శకుడిగా నా పేరు వేసుకోవడం. వేరే ఎవరి పేరు వేసినా ఆ సినిమా చాలా బాగా ఆడేది" అని అన్నారంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News