Godavari: బోటు పూర్తిగా పాడైపోయిందన్న ధర్మాడి సత్యం... ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్న అధికారులు!

  • గోదావరిలో రాయల్ వశిష్ట బోటు మునక
  • వెలికితీసిన ధర్మాడి సత్యం బృందం
  • బోటును కదిలించరాదంటున్న పోలీసులు!

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం వెలికితీసిన సంగతి తెలిసిందే. ఆ బోటు పూర్తిగా పాడైపోయిందని, ఇక పనికిరాదని ధర్మాడి సత్యం తెలిపారు. ఇప్పుడా బోటును ఏంచేయాలన్నది అధికారులకు సమస్యగా మారింది. బోటును యజమానికి అప్పగించాలా? 49 మంది మరణానికి కారణమైన బోటును పోలీసుల అధీనంలోనే ఉంచాలా? లేక, తుక్కు కింద మార్చేయాలా? అంటూ సందిగ్ధతకు లోనవుతున్నారు. బోటుపై కేసు నమోదైనందున దాన్ని గోదావరి ఒడ్డు నుంచి కదల్చకూడదని పోలీసులు అంటున్నారు.

కాగా, 30 టన్నుల బరువున్న రాయల్ వశిష్ట బోటు ప్రమాదానికి గురైన తర్వాత 20 టన్నులకు తగ్గిపోయింది. చాలా పార్టులు బోటు నుంచి విడిపోయాయి. దాంతో మరోసారి ప్రయాణానికి ఏమాత్రం ఉపయోగపడదని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై ఏర్పాటైన కమిటీ త్వరలోనే  బోటును పరిశీలించి నివేదిక సమర్పించనుంది.

More Telugu News