'రూలర్' నుంచి బాలయ్య మరో లుక్ విడుదల

26-10-2019 Sat 15:05
  • శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'రూలర్'
  • డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
  • యాక్షన్ సన్నివేశానికి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో 'రూలర్' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో 'ధర్మ' పాత్రను బాలయ్య పోషిస్తున్నారు. కాసేపటి క్రితం బాలయ్యకు చెందిన మరో లుక్ ను యూనిట్ విడుదల చేసింది. పోలీస్ యూనిఫాంలో ఉన్న బాలయ్య చేత్తో పెద్ద సుత్తిని పట్టుకుని ఆగ్రహంగా కనపడుతున్నారు. ఈ పోస్టర్ ను చూస్తుంటే... ఓ భారీ యాక్షన్ సన్నివేశానికి సంబంధించినట్టుగా కనపడుతోంది.

ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, భూమిక కీలక పాత్రలను పోషిస్తున్నారు. సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతోంది.