Vithala Charya: దర్శకుడు విఠలాచార్యకి జాతకాలపై నమ్మకం ఎక్కువట

  • విఠలాచార్య గారు పెద్దగా చదువుకోలేదు 
  • కన్నడ ఆయన మాతృభాష
  • తెలుగులో సినిమాలు చేయడానికి కారణమదే

తెలుగు తెరపై జానపద చిత్రాలను పరిగెత్తించిన దర్శకుడిగా విఠలాచార్యకి ప్రత్యేక స్థానం వుంది. ఆయన గురించిన విషయాలను సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ప్రస్తావించారు. "విఠలాచార్యతో నాకు మంచి సాన్నిహిత్యం వుంది. ఆయన ఇంటికి వెళ్లగానే ముందుగా ఫిల్టర్ కాఫీ వచ్చేసేది. ఆయన చదువుకున్నది మూడవ తరగతి వరకే. 'పుస్తకాల్లోని చదువు వేరు .. జీవితానుభవం వేరు' అని ఆయన అంటుండేవారు.

'నా గురించి పెద్ద పెద్ద మాటలు రాస్తుంటారుగానీ నాకు వాటి గురించి తెలియదు. నాకు తెలిసింది తీస్తున్నాను .. అదృష్టం కొద్దీ జనం చూస్తున్నారు' అనేవారు. విఠలాచార్య గారికి జాతకాలపై నమ్మకం ఎక్కువ. తన మాతృభాష కన్నడం అయినప్పటికీ ఆయన తెలుగులో సినిమాలు తీశారు. కన్నడలో సినిమాలు చేస్తే కలిసిరాదని ఎవరో జ్యోతిష్కుడు చెప్పడంతో ఆయన తెలుగులో తీస్తూ వచ్చారు. ఈ విషయాన్ని కూడా ఆయనే నాకు స్వయంగా చెప్పారు" అని అన్నారు.

More Telugu News