special trains: ఈస్ట్‌కోస్టు రైల్వే ఆధ్వర్యంలో 20 ప్రత్యేక రైళ్లు

  • రద్దీ మార్గాల్లో నడపాలని అధికారుల నిర్ణయం
  • ఢిల్లీ, సికింద్రాబాద్‌, అలహాబాద్ వంటి ప్రధాన నగరాలకు
  • ఐదు లక్షల మందికి అందుబాటులోకి రానున్న అదనపు బెర్తులు

రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో మరో 20 ప్రత్యేక రైళ్లను నడపాలని ఈస్టుకోస్టు రైల్వే అధికారులు నిర్ణయించారు. దేశంలోని ప్రధాన నగరాలకు ఈ రైళ్లను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ఈస్టుకోస్టు రైల్వే పరిధిలోని వివిధ స్టేషన్ ల నుంచి ఇవి ప్రారంభమవుతాయి. ఆన్ లైన్ రైల్వే టికెట్ బుకింగ్స్ లో సున్నా లేదా 8 నంబరుతో ప్రత్యేక రైలు నంబర్లు ప్రారంభమవుతాయని అధికారులు వివరించారు. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే ఐదు లక్షల మంది ప్రయాణికులకు అవసరమైన బెర్తులు లభిస్తాయి.

ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీ, సికింద్రాబాద్, బెంగళూరు, హౌరా, చెన్నై,  అలహాబాద్, పాట్నా, భాగల్పూర్ నగరాలకు ఎక్కువ రద్దీ ఉంటుందని, ఈ రూట్లపై దృష్టిసారిస్తున్నామని అధికారులు తెలిపారు.  దీంతోపాటు సాధారణ రైళ్లలోనూ బోగీల సంఖ్యను పెంచాలని నిర్ణయించామని రైల్వే అధికారులు చెప్పారు.

 పండగల సందర్భంగా రాకపోకలు సాగించే ప్రయాణికులు, సాధారణ రైళ్లలో వెయిటింగ్ లిస్టు వస్తే ప్రత్యేక రైళ్లలో టికెట్లు తీసుకోవచ్చని అధికారులు సూచించారు.

More Telugu News