'క్లాప్' మూవీ నుంచి ఫస్టులుక్

Sat, Oct 26, 2019, 12:38 PM
  • ద్విభాషా చిత్రంగా 'క్లాప్'
  • కీలక పాత్రల్లో ప్రకాశ్ రాజ్ - నాజర్ 
  • సంగీత దర్శకుడిగా ఇళయరాజా    
ఆది పినిశెట్టి కథానాయకుడిగా తమిళ .. తెలుగు భాషల్లో 'క్లాప్' సినిమా రూపొందుతోంది. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికి కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫస్టులుక్ ను వదిలారు. ఈ పోస్టర్లో ఆది పినిశెట్టి డీసెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు.

స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామా ఇది. ప్రకాశ్ రాజ్ .. నాజర్ ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. మొత్తం ఐదు పాటల్లో ఎమోషనల్ సాంగ్ .. మోటివేషనల్ సాంగ్ హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, ఆది పినిశెట్టిని హీరోగా బిజీ చేస్తుందేమో చూడాలి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad