Kalyan Dev: చిరంజీవి చిన్నల్లుడు హీరోగా 'సూపర్ మచ్చి' .. ఫస్టులుక్ రిలీజ్

  • కల్యాణ్ దేవ్ రెండో సినిమా 'సూపర్ మచ్చి'
  • 50 శాతం చిత్రీకరణ పూర్తి 
  •  సంగీత దర్శకుడిగా తమన్  

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ఆ మధ్య 'విజేత' సినిమా ద్వారా పరిచయమయ్యాడు. ఆ సినిమా సక్సెస్ కాకపోయినా, లుక్స్ పరంగా మంచి పేరే తెచ్చింది. ఆయన రెండవ సినిమాకి పులివాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సినిమాకి తాజాగా 'సూపర్ మచ్చి' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, కొంతసేపటి క్రితం ఫస్టులుక్ ని వదిలారు. వర్షంలో .. జనం మధ్యలో విజయోత్సాహంతో కల్యాణ్ దేవ్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. టైటిల్ ను బట్టి .. లుక్ ను బట్టి మాస్ అంశాలు ఎక్కువగా కలిగిన మూవీ అనే విషయం అర్థమవుతోంది. తమన్ స్వరాలను సమకూర్చిన ఈ సినిమా, ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో, కల్యాణ్ దేవ్ జోడీగా 'రియా చక్రవర్తి' కనిపించనుంది. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

More Telugu News