Avanthi Srinivas: మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించిన జనసేన

  • భవన నిర్మాణ కార్మికులతో కలసి అవంతి ఇంటిని ముట్టడించిన జనసేన
  • కార్మికులతో మాట్లాడిన అవంతి
  • త్వరలోనే ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామంటూ హామీ

ఇసుక కొరతతో ఏపీలోని భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వంపై విపక్షాలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. తాజాగా భవన నిర్మాణ కార్మికులతో కలసి జనసేన నేతలు విశాఖలోని మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని, తమకు ఉపాధి కల్పించాలని నినదించారు.

 ఈ సందర్భంగా కార్మికులు, జనసేన నేతలతో అవంతి మాట్లాడారు. తమ కష్టాలను మంత్రికి కార్మికులు వివరించారు. అనంతరం అవంతి మాట్లాడుతూ, వీలైనంత త్వరలో ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కొన్ని పార్టీలు కావాలనే ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నాయని, రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నాయని విమర్శించారు.

More Telugu News