godavari river: కచ్చులూరు దుర్ఘటన: తెలంగాణలోని 12 బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం

  • రూ.1.20 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
  • పరిహారం చెల్లించాల్సిందిగా ప.గో. కలెక్టర్‌కు ఆదేశం
  • ప్రాణాలు కోల్పోయిన వారిలో 9 మంది వరంగల్ వాసులు

బోటు ప్రమాదంలో అసువులు బాసిన తెలంగాణకు చెందిన 12 మంది కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున మొత్తం రూ.1.20 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు చెల్లించేందుకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు అనుమతి మంజూరు చేసింది.

గోదావరి నదిపై కచ్చులూరు వద్ద గత నెలలో జరిగిన బోటు ప్రమాదంలో 40 మందికిపైగా మృతి చెందారు. వీరిలో తెలంగాణకు చెందిన భాస్కి రాజేందర్‌, బాస్కి అవినాశ్‌, బాస్కి రాజేంద్రప్రసాద్‌, గోరె రాజేంద్రప్రసాద్‌, బాస్కి వెంకటయ్య, దోమల హేమంత్‌, భాస్కి ధర్మరాజు, కొమ్ముల రవి, కొండూరు రాజ్‌కుమార్‌, రేపాకుల విష్ణుకుమార్‌, గడ్డమీది సునీల్‌, ఎరాన్‌ సాయికుమార్‌లు ఉన్నారు. ఆయా కుటుంబాలకు కలెక్టర్ పరిహారం చెక్కులు అందించనున్నారు.

మృతి చెందిన వారిలో 9 మంది వరంగల్ జిల్లా వాసులు కాగా, ఖమ్మం, జనగామ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. కాగా, నెల రోజులుగా గోదావరిలో మునిగిన బోటును మూడు రోజుల క్రితం ధర్మాడి సత్యం బృందం వెలికి తీసింది. దీంతో గల్లంతైన మిగిలివారి ఆచూకీ లభ్యమైంది.

More Telugu News