Bihar: ఓటర్లు ప్రమాదకర తీర్పునిచ్చారు.. బీహార్లో ఎఐఎంఐఎం గెలుపుపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్

  • ఓటర్ల తీర్పు రాష్ట్ర సామజిక సమగ్రతకు భంగకరం
  • ఎఐఎంఐఎం జిన్నాభావజాలంను కలిగివుంది
  • వారు సామజిక  సమగ్రతకు ముప్పు తెచ్చే ప్రమాదం

బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎఐఎంఐఎం (అల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహదుల్ ముస్లిమీన్) గెలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో రాష్ట్ర అసెంబ్లీలో ఎఐఎంఐఎం ఖాతా తెరిచినట్లైంది. బీహార్ లోని కిషన్ గంజ్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎఐఎంఐఎం అభ్యర్థి కమ్రుల్ హోడా తన సమీప బీజేపీ ప్రత్యర్థి స్వీటిసింగ్ పై విజయం సాధించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఓటర్ల తీర్పును రాష్ట్రంలో సామజిక సమగ్రతకు భంగకరమని అభివర్ణించారు. ఈరోజు సింగ్ మీడియాతో మాట్లాడారు.

‘బీహార్ ఉప ఎన్నికలో అతి ప్రమాదకరమైన తీర్పు వెలువడింది. కిషన్ గంజ్ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎఐఎంఐఎం విజయం సాధించింది. అది జిన్నా భావజాలంను కలిగి వుంది. వారు వందే మాతరంను అసహ్యించుకుంటారు. రాష్ట్రంలో సామాజిక సమగ్రతకు వారు ముప్పుగా పరిణమించే అవకాశముంది’ అని అన్నారు. బీహార్ ప్రజలు తమ భవిష్యత్తుపై ఆలోచన చేయాలని సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

More Telugu News