Tsrtc: ఆర్టీసీ కేసీఆర్ జాగీర్ కాదు: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

  • మూసివేస్తామంటే ఊరుకునేది లేదు
  • నష్టాల్లో ఉందని తెలిసీ ఐదేళ్లుగా ఊరుకున్నారెందుకు ?
  • ఒక్కసారి కూడా సమీక్ష జరుపలేదెందుకు ? 

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఆర్టీసీ కేసీఆర్ జాగీర్ కాదని.. దాన్ని ఎట్లా మూసివేస్తారని ప్రశ్నించారు. నష్టాలు చవిచూస్తున్న ఆర్టీసీపై ముందే సమీక్ష ఎందుకు చేయలేదన్నారు. ఐదేళ్లలో సమీక్షలు చేయని మీరు ఇప్పుడు మూసివేస్తామంటే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. ఈరోజు షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. నిన్న కేేసీఆర్ ప్రెస్ మీట్ లో ఆర్టీసీ సమ్మెపై చేసిన వ్యాఖ్యలను షబ్బీర్ తీవ్ర స్థాయిలో ఖండించారు.

‘గతంలో తాను రవాణాశాఖ మంత్రిగా పని చేశానని చెబుతున్న కేసీఆర్.. విషయాలన్నీ తెలుసు అంటూ ఎవరినీ ప్రశ్నించనీయరా? ఆర్టీసీకి ఇన్నినష్టాలు వచ్చేంత వరకు చూశారు. ఐదేళ్ల పైగా సీఎంగా పనిచేస్తున్నారు. దీనిపై మీరు ఒక్కసారి కూడా సమీక్ష జరపలేదెందుకు?’ అని నిలదీశారు. ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని ఎందుకు నియమించలేదని అడిగారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని తెలిసినప్పటికి డీజిల్ పై విధిస్తున్న పన్నులో రాష్ట్ర వాటాను తగ్గించి ఆర్టీసీకి ఎందుకు ఊరటనియ్యలేకపోయారని షబ్బీర్ ప్రశ్నించారు.

More Telugu News