Aswathama Reddy: అశ్వత్థామరెడ్డిపై ఆర్టీసీ డ్రైవర్ కేసు

  • కార్మికుల మరణాలకు అశ్వత్థామే కారణమంటూ ఫిర్యాదు
  • సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత కార్మికుల వైఖరిలో మార్పుకు సంకేతం ?
  • సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మికుల వెనకడుగు?

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డికి వ్యతిరేకంగా పోలీసు కేసు నమోదు అయింది. కార్మికులు సమ్మె బాట పట్టిన తర్వాత కొందరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతికి జేఏసీ కన్వీనర్ గా ఉన్న అశ్వత్థామరెడ్డి కారణమని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో డ్రైవర్ కోరేటి రాజు ఫిర్యాదు చేశాడు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమవుతుందంటూ అశ్వత్థామరెడ్డి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ యూనియన్ నాయకులే కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు మంచివారేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు నమోదు కావడం ఆసక్తికరంగా మారింది.

More Telugu News