Tirumala: ప్లాస్టిక్‌ రహితంగా తిరుమల గిరులు : టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి

  • దశలవారీగా నిషేధానికి చర్యలు
  • లడ్డూలకు ప్రత్యామ్నాయ కవర్లు
  • విద్యుత్‌ ఆధారిత బస్సు వాడకం

ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల గిరులను ప్లాస్టిక్‌ రహిత ప్రాంతంగా మార్చేందుకు దేవస్థానం ప్రయత్నాలు చేస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన ఓ సందేశం ఉంచారు. ప్లాస్టిక్‌ నిషేధం కోసం దశల వారీగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రస్తుతం భక్తులు కొనుగోలు చేస్తున్న లడ్డూలకు అందజేస్తున్న ప్లాస్టిక్‌ కవర్లకు బదులు ప్రత్యామ్నాయ కవర్లు ప్రవేశపెడతామని తెలిపారు. అలాగే, భక్తుల ప్రయాణం కోసం విద్యుత్‌ ఆధారిత బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.

More Telugu News