Vishnu Vardhan Reddy: వైసీపీ, టీడీపీల మధ్య క్విడ్ ప్రోకో నడుస్తోందని అందుకే చెబుతున్నాం: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • పోలవరం అవినీతిపై జగన్ ఎందుకు లేఖ రాయడం లేదు?
  • లేఖ రాస్తే 24 గంటల్లో సీబీఐ విచారణ జరిపిస్తాం
  • దొంగలను జైల్లో పెడతాం

ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య క్విడ్ ప్రోకో నడుస్తోందని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో అంతులేని అవినీతి జరిగిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 900 కోట్లు ఆదా చేసినట్టు వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటోందని ఆయన అన్నారు. పోలవరంలో అవినీతి చోటు చేసుకున్నట్టైతే... సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర కేబినెట్ కేంద్రానికి లేఖ రాస్తే... 24 గంటల్లో చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజాధనాన్ని మింగేసిన దొంగలను జైల్లో పెడతామని అన్నారు.

పోలవరమే కాకుండా, ఇతర పనుల్లో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి ఎందుకు లేఖలు రాయడం లేదని విష్ణు ప్రశ్నించారు. అందుకే వైసీపీ, టీడీపీల మద్య క్విడ్ ప్రోకో ఉందని తాము అంటున్నామని తెలిపారు. కేంద్ర విచారణ సంస్థలు జోక్యం చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు లేఖ రాయాలని చెప్పారు. లేఖ రాస్తే తాము వెంటనే చర్యలు చేపడతామని చెప్పారు.

More Telugu News