Sujana Chowdary: ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన జగన్ 'రాజధాని'పై స్పందించాలి: సుజనా చౌదరి

  • రాజధానిపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర గందరగోళం ఉంది
  • ఈ గందరగోళానికి జగన్ తెరదించాలి
  • భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలకు మనుగడ లేదు

ఏపీ రాజధానిపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర గందరగోళం ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. దీనిపై ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని... గందరగోళానికి తెరదించాలని చెప్పారు. ఈ అంశంపై జాతీయ పార్టీగా తాము ఇప్పుడే స్పందించలేమని అన్నారు.

 భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదని చెప్పారు. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయని విమర్శించారు. ఏపీ, తెలంగాణల్లో ఏ పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకోబోదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ చేపట్టిన గాంధీ సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News