Sonowal: చంపేస్తానంటూ ముఖ్యమంత్రిని బెదిరించిన టీవీ ఛానల్ ఉద్యోగి!

  • 'అసోం టాక్స్' ఛానల్ లో పని చేస్తున్న రహమాన్
  • తుపాకీతో సీఎంను చంపేస్తానంటూ పోస్ట్
  • అరెస్ట్ చేసిన పోలీసులు

హతమారుస్తానంటూ ఏకంగా ముఖ్యమంత్రినే బెదిరించిన టీవీ ఛానల్ ఉద్యోగికి పోలీసులు అరదండాలు వేశారు. వివరాల్లోకి వెళ్తే, అసోం రాజధాని గువహటికి చెందిన మునీరుద్దీన్ రహమాన్ 'అసోం టాక్స్' ఛానలో పని చేస్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ను చంపుతానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

 సురాజిత్ హర్ష్ పేరిట ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి, అస్సామీ భాషలో సీఎంను దూషిస్తూ కామెంట్లు చేశాడు. తన వద్ద తుపాకీ ఉందని, ముఖ్యమంత్రిని చంపేస్తానని పోస్ట్ లో పేర్కొన్నాడు. దీన్ని సీరియస్ గా తీసుకున్న గువహటి పోలీస్ కమిషనర్ దర్యాప్తుకు ఆదేశించారు. చివరకు ఆ పోస్ట్ పెట్టింది రహమాన్ అని తేలడంతో, అతన్ని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 294, 295 ఏ, 506, 67 ఐటీ యాక్ట్ ల కింద కేసు నమోదు చేశారు.

More Telugu News