Ongole: 123 పందాలు గెలిచిన ఒంగోలు గిత్త మృతి!

  • అకస్మాత్తుగా మరణించిన గిత్త
  • పలు రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో విజయం
  • ఘనంగా అంత్యక్రియలు

జాతీయ, రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీల్లో పాల్గొని, వందకుపైగా బహుమతులు సాధించి, కృష్ణా జిల్లాకు పేరు తెచ్చిన ఓ ఖరీదైన గిత్త అకస్మాత్తుగా మరణించింది. పాత గన్నవరంలోని శ్రీ లక్ష్మీనరసింహ నంది బ్రీడింగ్‌ అండ్‌ బుల్స్‌ సెంటర్‌ నిర్వాహకుడైన కాసన్నేని రాజా 2017 నవంబర్‌ లో పోతిరెడ్డిపల్లికి చెందిన ఈ ఒంగోలు జాతి గిత్తను రూ.15 లక్షలకు కొనుగోలు చేశారు. తన వద్ద ఉన్న మరో రెండు, మూడు గిత్తలతో కలిపి శిక్షణ ఇచ్చి, పోటీలకు పంపారు. పలు రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్న ఈ గిత్త, 123 బహుమతులను అందుకుంది. గిత్త మరణించిందన్న విషయాన్ని తెలుసుకుని, పలువురు నివాళులు షర్పించారు. ఆపై ట్రాక్టర్ ను పూలతో అలంకరించి, ఘనంగా అంతిమయాత్ర జరిపారు.

More Telugu News