pulichintala project: పులిచింతలకు పెరిగిన వరద ఉద్ధృతి.. 20 స్పిల్‌వే గేట్లను ఎత్తేసిన అధికారులు

  • ఎగువ నుంచి పెరుగుతున్న నీటి ప్రవాహం
  • సాగర్ నుంచి 6.17 లక్షల క్యూసెక్కుల నీరు
  • 5.97 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్న అధికారులు

పులిచింతల జలాశయానికి గురువారం రాత్రి నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. సాగర్ నుంచి 6.17 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో అధికారులు 20 స్పిల్‌వే గేట్లను ఎత్తి 5.97 లక్షల క్యూసెక్కులను దిగువకు విడిచిపెడుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 172.37 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి వరద ఉద్ధృతి  పెరుగుతుండడంతో జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉంది.

More Telugu News