Dubai: భారత జాతీయ గీతాన్ని హృద్యంగా పలికించిన దుబాయ్ పోలీసు బ్యాండ్

  • దుబాయ్, భారత్ మధ్య సత్సంబంధాలు
  • దుబాయ్ లో అధికారికంగా దీపావళి వేడుకలు
  • భారత దౌత్య కార్యాలయంతో కలిసి నిర్వహించిన దుబాయ్ టూరిజం విభాగం

దుబాయ్ లో భారతీయులు అనేక హోదాల్లో, అనేక రంగాల్లో తమ సేవలందిస్తుండడం తెలిసిందే. దుబాయ్, భారత్ మధ్య ఎన్నో దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ప్రతి ఏడాది దుబాయ్ లో దీపావళి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా దుబాయ్ లో దీపావళి సంబరాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో దుబాయ్ పోలీసు బ్యాండ్ భారత జాతీయ గీతం జనగణమనను ఎంతో హృద్యంగా పలికించిన తీరు ఆహూతులను ఆకట్టుకుంది. దుబాయ్ లోని హాతీస్ గార్డెన్ లో ఈ వేడుకలు జరిపారు. దుబాయ్ లో భారత రాయబార కార్యాలయం సహకారంతో దుబాయ్ టూరిజం విభాగం ఈ కార్యక్రమం నిర్వహించింది.

More Telugu News