Telangana: సమ్మె ముగింపెక్కడిది? ఆర్టీసీనే ముగుస్తుంది!: సీఎం కేసీఆర్

  • ఆర్టీసీ ఐదు వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది
  • కార్మికుల పీఎఫ్ సొమ్మును ప్రభుత్వం తీసుకోలేదు
  • ఆర్టీసీకి ఏడాదికి రూ.1200 కోట్ల నష్టాలు

ఇక ఆర్టీసీ కథ ముగియనుందని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘నాకు కూడా బాధ ఉంది. సమ్మె ముగింపు ఎక్కడిది? ఆర్టీసీనే ముగుస్తుంది. ఎస్.. ఇటీజ్ ఏ ఫ్యాక్ట్. ఇటీజ్ గోయింగ్ టూ హేపెన్. ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు వాళ్లవి (ఆర్టీసీ). బ్యాంకులు ఇచ్చిన అప్పులకు ఒక నెల కిస్తీ కట్టకపోతే ఎన్పీ అవుతుంది’ అని విమర్శించారు. కార్మికుల పీఎఫ్ సొమ్మును ప్రభుత్వం తీసుకుంటుందా? ఎవరూ తీసుకోలేదని స్పష్టం చేశారు. కార్మికుల పీఎఫ్ సొమ్మును తిరిగి వాళ్ల కిచ్చే దమ్ము ఆర్టీసీకి లేదని విమర్శించారు.

రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులకు ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితి లేదని, ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చే పరిస్థితి లేదు, ఆర్టీసీ స్టోర్స్ లో ఉన్న డబ్బును యాజమాన్యం వాడుకుందని, ఆ డబ్బును తిరిగి ఇచ్చే పరిస్థితి లేదని, అందుకు కారణం నష్టాలని వివరించారు. ఆర్టీసీకి ఏడాదికి పన్నెండు వందల కోట్ల రూపాయల నష్టాలు వస్తున్నాయని, హైదరాబాద్ లో ఎన్ని ట్రావెల్స్ సంస్థల బస్సులు నడుస్తాయి? జబ్బార్ ట్రావెల్స్, కేశినేని ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్, గంగినేని ట్రావెల్స్.. అవి లాభాల్లో ఎలా ఉంటాయి? ఆర్టీసీ ఏమో మునుగుతుందా? ఈ విషయం తనకు అర్థం కావడం లేదని కేసీఆర్ అన్నారు.

More Telugu News