BJP: 'మహా' ఎన్నికల్లో అన్న- చెల్లి మధ్య పోరులో అన్నదే గెలుపు!

  • బీజేపీ అభ్యర్థి పంకజ ఓటమి
  • 30,524 ఓట్ల తేడాతో అన్న ధనంజయ్ గెలుపు
  • 2014లో అన్నపై గెలిచి సిట్టింగ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పంకజ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా చెల్లెలు మధ్య జరిగిన రసవత్తర పోటీలో అన్ననే విజయం వరించింది. బీజేపీ సీనియర్ నేత, దివంగత గోపీనాథ్ ముండే కుమార్తెగా రాజకీయాల్లోకి ప్రవేశించిన పంకజ గోపీనాథ్ రావు ముండే అతి తక్కువ సమయంలోనే మంచి నాయకురాలిగా ఎదిగారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీడ్ జిల్లాలోని పర్లీ నియోజకవర్గం నుంచి పంకజ సిట్టింగ్ అభ్యర్థిగా బరిలోకి దిగగా,  అమెకు పోటీగా గోపీనాథ్ ముండే సోదరుడి కుమారుడు ధనంజయ్ పండిత్ రావు ముండే ఎన్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి 30,524 ఓట్ల తేడాతో విజయ బావుటా ఎగురవేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం వీరిద్దరి మధ్యే పోటీ సాగింది. అప్పుడు పంకజ 25వేల మెజారిటీతో అన్నపై విజయం సాధించారు.

More Telugu News