Telangana: ఏం సమ్మె ఇది? బుద్ధీజ్ఞానంతో చేసేదేనా?: సీఎం కేసీఆర్

  • టీఎస్సార్టీసీ కార్మికుల సమ్మెపై తీవ్ర విమర్శలు
  • తిన్నది అరగక చేసే సమ్మెలా?
  • ఏ ప్రభుత్వం ఉన్న ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటారు!

తమ డిమాండ్ల సాధన కోసం కొన్ని రోజులుగా టీఎస్సార్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘ఏం సమ్మెలు ఇవి? అర్థం, ఆలోచన, బుద్ధీ జ్ఞానం ఉండే చేసే సమ్మెలేనా ఇవి? దిక్కుమాలిన సమ్మెలా, ఏం సమ్మెలివి? తిన్నది అరగక చేసే సమ్మెలా?’ అంటూ విరుచుకుపడ్డారు.

ఏ ప్రభుత్వం వున్నా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటారని విమర్శించారు. అసలు, ఈ సమ్మెకు కారణమేంటో తెలుసా? కార్మిక సంఘాలకు రెండేళ్లకో, మూడేళ్లకో, నాలుగేళ్లకో దిక్కుమాలిన యూనియన్ ఎలక్షన్స్ ఉంటాయని, ఆ ఎలక్షన్ల ముందు చేసే పనికిమాలిన సమ్మెలివి అని విమర్శించారు. యూనియన్ ఎలక్షన్ల ముందు గొంతెమ్మ కోర్కెలు, అలవికాని కోర్కెలు పెట్టి సమ్మె రూపంలో కార్మికులను రెచ్చగొట్టి, నాలుగు ఓట్లు రాబట్టుకునే చిల్లరమల్లర రాజకీయాల సమ్మె ఇదని తీవ్ర విమర్శలు చేశారు.

More Telugu News