150 కోట్ల క్లబ్ లోకి ధనుశ్ 'అసురన్'

Thu, Oct 24, 2019, 04:30 PM
  • వెట్రి మారన్ నుంచి వచ్చిన 'అసురన్'
  • విభిన్నమైన పాత్రలో ధనుశ్ 
  • వసూళ్ల పరంగా కొత్త రికార్డులు
కోలీవుడ్లో కొన్ని రోజులుగా 'అసురన్' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. ధనుశ్ కథానాయకుడిగా చేసిన ఈ సినిమా అక్కడ వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తోంది. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, దసరా కానుకగా ఈ నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథా కథనాలపరంగా .. ధనుశ్ నటన పరంగా ఈ సినిమా ప్రేక్షకులచే ప్రశంసలు అందుకుంటోంది.

కోలీవుడ్ సినీ ప్రముఖులే కాదు .. టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా వేగంగా ఈ సినిమా 150 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ధనుశ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ధనుశ్ కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకం అని అభిమానులు కితాబునిస్తున్నారు. దీపావళికి విజయ్ .. కార్తీ సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాల పోటీని 'అసురన్' ఎంతవరకూ తట్టుకుని నిలబడుతుందో చూడాలి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement