bp: బీపీ మాత్రలు రాత్రి వేసుకుంటేనే మెరుగైన ఫలితాలు.. తాజా అధ్యయనంలో వెల్లడి

  • బీపీని అదుపులో ఉంచొచ్చు
  • గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది
  • తేల్చి చెప్పిన స్పెయిన్ పరిశోధకులు 

రక్తపోటు (బీపీ) ఉన్నవారు రాత్రి సమయంలో మాత్రలు వేసుకుంటేనే మెరుగైన ఫలితాలు ఉంటాయని పరిశోధకులు తేల్చారు. సాధారణంగా బీపీ ఉన్నవారు ఉదయం లేవగానే మందులు వేసుకొంటారని వైద్యులు సూచిస్తుంటారు. ఈ పద్ధతి కన్నా రాత్రుళ్లు ఈ మాత్రలు వేసుకుంటేనే బీపీ అదుపులో ఉంటుందని స్పెయిన్ పరిశోధకులు అంటున్నారు.

బీపీ మాత్రలను రాత్రి నిద్రపోయే ముందు వేసుకుంటే బీపీని అదుపులో ఉంచడమే కాకుండా గుండెపోటు లాంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం కూడా సగానికి తగ్గిందని పరిశోధకులు తేల్చి చెప్పారు. దాదాపు ఆరేళ్ల పాటు 19,000 మందిపై జరిపిన పరిశోధనల ఫలితంగా ఈ వివరాలను వెల్లడించారు.

More Telugu News