పూరితో సినిమా చేయడానికి నేను సిద్ధం: సల్మాన్

- షూటింగు పూర్తి చేసుకున్న 'దబాంగ్ 3'
- ప్రమోషన్స్ మొదలెట్టిన సల్మాన్
- డిసెంబర్ 20వ తేదీన విడుదల
తెలుగులో పూరి చేసిన 'పోకిరి' సినిమాను హిందీలో సల్మాన్ హీరోగా ప్రభుదేవా తెరకెక్కించగా అక్కడ అది 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అప్పటి నుంచి పూరి సినిమాల్లో కంటెంట్ పై సల్మాన్ కి మంచి నమ్మకం వుంది. ఈ కారణంగానే ఆయన పూరితో సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతున్నాడని అంటున్నారు. విజయ్ దేవరకొండతో 'ఫైటర్' పూర్తికాగానే, సల్మాన్ తో పూరి సెట్స్ పైకి వెళ్లినా ఆశ్చర్యంలేదని చెప్పుకుంటున్నారు.