Gujarath: గుజరాత్ లో ఆరు స్థానాల్లో ఉపఎన్నికలు.. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ

  • గుజరాత్ లో చెరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్
  • ఉత్కంఠ రేపుతున్న గుజరాత్ ట్రెండ్స్
  • మహారాష్ట్రలో ఆధిక్యం దిశగా బీజేపీ-శివసేన కూటమి

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా పలు చోట్ల జరిగిన ఉపఎన్నికలకు ఈరోజు కౌంటింగ్ జరుగుతోంది. గుజరాత్ లో ఆరు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఉపఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఆరు స్థానాల్లో చెరో మూడు స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ లు ముందంజలో ఉన్నాయి. మరోవైపు మహారాష్ట్రలో స్పష్టమైన ఆధిక్యం దిశగా బీజేపీ-శివసేన కూటమి కొనసాగుతోంది. హర్యానాలో బీజేపీ ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ... హంగ్ దిశగా ట్రెండ్స్ వెలువడుతున్నాయి.

More Telugu News