internet: స్మార్ట్ బల్బులు వాడుతున్నారా?.. హ్యాకింగ్ ప్రమాదం పొంచి ఉంటుందంటున్న పరిశోధకులు

  • తేల్చి చెప్పిన టెక్సాస్ వర్సిటీ పరిశోధకులు 
  • ఇన్ ఫ్రా రెడ్ క్యాపబిలిటీస్ తో పనిచేసే స్మార్ట్ లైట్లు 
  • కంప్యూటర్లలోని సమాచారాన్ని హ్యాకర్లు చోరీ చేసే అవకాశం

స్మార్ట్ లైట్ల ద్వారా హ్యాకర్లు దాడి చేసే అవకాశం ఉంటుందని, సమాచార భద్రతకు ముప్పు పొంచి ఉందని అమెరికాలోని టెక్సాస్ వర్సిటీ పరిశోధకులు తేల్చారు. ఆధునిక కాలంలో స్మార్ట్ లైట్ల వాడకం పెరిగిపోతోంది. ఈ లైట్లలో వాతావరణంలో వెలుగును బట్టి కాంతి సర్దుబాటు అవుతుంది. ఇన్ ఫ్రా రెడ్ క్యాపబిలిటీస్ తో పనిచేసే ఈ లైట్లు ఆటోమేడెట్ కంట్రోల్స్ తో మన ఇళ్లలోని నెట్ వర్క్ తో పని లేకుండానే బిగ్ జీ, జీ వేవ్ ప్రొటోకాల్స్, బ్లూటూత్ ఆధారంగా పనిచేసే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తో అనుసంధానం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

దీంతో స్మార్ట్ బల్బుల ద్వారా వాటికి సంకేతాలు పంపి ఇంట్లో వాడే కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లలోని సమాచారాన్ని హ్యాకర్లు చోరీ చేసే అవకాశాలు ఉన్నాయని తేల్చారు. స్మార్ట్ లైట్లలో ఉన్న ఈ లోపాలను తయారీదారులు సవరించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచించారు. 

More Telugu News