Karnataka: వరుణ దేవుడి కోపం వల్లే కర్ణాటకలో వరదలు ముంచెత్తాయి!: ముఖ్యమంత్రి ఉవాచ

  • ఆగస్టులో కురిసిన వర్షాలకు అతలాకుతలమైన కర్ణాటక
  • నక్షత్రాలు సరిగా లేకపోవడం వల్లేనన్న సీఎం
  • పలు జిల్లాలపై వరుణ దేవుడు దండెత్తాడని ఆవేదన

కర్ణాటకలో ఇటీవల ముంచెత్తిన వర్షాలకు దేవుడి కోపమే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. దేవుడు కోపంగా ఉండడంతో పాటు నక్షత్రాలు కూడా సరిగా లేకపోవడం వల్లే వరదలు సంభవించాయన్నారు. రెండు నెలల క్రితం కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల కారణంగా నైరుతి కర్ణాటక ప్రాంతం అతలాకుతలమైంది. 22 జిల్లాలు వరద తాకిడికి గురయ్యాయి. 84 మంది ప్రాణాలు కోల్పోయారు. జనజీవనం అస్తవ్యస్తమైంది. 1.5 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది.

తాజాగా, ఈ వరదలపై సీఎం మాట్లాడారు. వరుణ దేవుడి కోపం వల్లే రాష్ట్రంలో వర్షాలు ముంచెత్తాయని అన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలపై ఆయన దండెత్తాడని పేర్కొన్నారు. అంతేకాదు, మన నక్షత్రాలు కూడా సరిగా లేవని యడియూరప్ప ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News