Hongkong: హాంగ్ కాంగ్ ప్రభుత్వంపై ప్రజా విజయం..నేరస్థుల అప్పగింత బిల్లు ఉపసంహరణ

  • చైనాకు నేరస్థుల అప్పగింత బిల్లు వివాదాస్పదం
  • ప్రజల నిరసనలతో దిగొచ్చిన ప్రభుత్వం
  • అధికారికంగా బిల్లు ఉపసంహరణ

హాంగ్ కాంగ్ లో అత్యంత వివాదాస్పదంగా మారిన చైనాకు నేరస్థుల అప్పగింత బిల్లును అధికారికంగా ఉపసంహరించారు. ఈ మేరకు ఆ దేశ భద్రతా కార్యదర్శి జాన్ లీ ప్రకటించారు. ఏప్రిల్ లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం నేరస్థులు అనే అనుమానం ఉన్న వారిని చైనాకు అప్పగించే వీలుంటుంది. దీనిపై వివాదం తలెత్తడంతో పాటు దేశ ప్రజల నుంచి నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో ఈ బిల్లును జూన్ లో పక్కన బెట్టారు కానీ, ఉపసంహరించలేదు. ఈ బిల్లును పూర్తిగా ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు మరోమారు నిరసనకు దిగడంతో ఎట్టకేలకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది.  

More Telugu News