Andhra Pradesh: ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా మంచి రాజధానిని నిర్మిస్తాం: ఏపీ మంత్రి బొత్స

  • రాజధాని అంటే ఐదు కోట్ల ప్రజలకు సంబంధించింది
  • ప్రజలు కోరుకున్న రీతిలో ఈ రాజధాని ఉంటుంది
  • నిపుణుల కమిటీ ప్రకారం ముందుకెళ్తాం

రాష్ట్ర రాజధాని అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో సంబంధించింది కాదనీ, ఐదు కోట్ల ప్రజానీకానికి సంబంధించిందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైజాగ్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా మంచి రాజధానిని నిర్మిస్తామని ప్రకటించారు.

రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్న రీతిలో ఈ రాజధాని ఉంటుందని, అందుకే, ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ రాష్ట్ర మంతటా పర్యటిస్తుందని, అక్కడి పరిస్థితులను బేరీజు వేస్తుందని, ప్రజల మనోభావాలను తెలుసుకుంటుందని అన్నారు. రాజధానిగా ఏ ప్రాంతాన్ని అయితే ఆ కమిటీ సభ్యులు నిర్ణయిస్తారో, దాని ప్రకారం ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని నిర్ణయించుకుందని స్పష్టం చేశారు.

More Telugu News