రష్మిక క్లారిటీ ఇచ్చినా ఆగని రూమర్

23-10-2019 Wed 17:09
  • యూత్ లో రష్మికకి క్రేజ్ 
  • పెరుగుతోన్న అవకాశాలు 
  •  పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేస్తోందంటూ పుకార్లు 

తెలుగు తెరపై చాలా తక్కువ సమయంలో క్రేజ్ తెచ్చుకున్న కథానాయికలలో రష్మిక ఒకరు. వరుస అవకాశాలతో ఈ సుందరి దూసుకుపోతోంది. ఈ కారణంగానే ఈ అమ్మాయి కేర్ లెస్ గా వ్యవహరిస్తోందనీ, పారితోషికం కూడా బాగా పెంచేసిందనే ప్రచారం ఆ మధ్య జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని రష్మిక క్లారిటీ ఇచ్చింది కూడా.

అయినా ఇప్పుడు మళ్లీ అదే రూమర్ షికారు చేస్తోంది. ఇటీవల చైతూ జోడీగా చేయమని అడిగితే, ఆయనకంటే పారితోషికం ఎక్కువగా అడిగిందనే ప్రచారం జోరందుకుంది. 'మజిలీ' తరువాత చైతూ ఒక్కో సినిమాకి 4 నుంచి 5 కోట్ల వరకూ తీసుకుంటున్నాడు. పూజా హెగ్డే వంటి హీరోయిన్ కే అందులో సగం ఇస్తున్నారు. అందువలన చైతూ కంటే ఎక్కువ పారితోషికాన్ని రష్మిక అడిగే అవకాశం లేదనీ, ఇదంతా ఎవరో పనిగట్టుకుని చేస్తున్న ప్రచారమనేది సన్నిహితుల మాట.