Karthi: 'ఖాకీ' మాదిరిగానే 'ఖైదీ' గుర్తుండిపోతుంది: హీరో కార్తీ

  • నా కెరియర్లో 'ఖాకీ' మూవీ ప్రత్యేకం 
  • 'ఖైదీ' ఉత్కంఠభరితంగా సాగుతుంది 
  • లారీ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ అవుతుందన్న కార్తీ  

కార్తీకి కొంతకాలంగా చెప్పుకోదగిన హిట్ పడలేదు. దాంతో కార్తీతో పాటు ఆయన అభిమానులంతా కూడా అసంతృప్తితో వున్నారు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన చేసిన సినిమానే 'ఖైదీ'. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో కార్తీ మాట్లాడుతూ .. "నా కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో 'ఖాకీ' ఒకటి. మొదటి నుంచి చివరివరకూ ఈ సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది. అందువలన ఆ సినిమాను ప్రేక్షకులు మరిచిపోలేదు. అదే తరహాలో పూర్తి ఉత్కంఠభరితంగానే 'ఖైదీ' సినిమా సాగుతుంది. లారీతో లైవ్ స్పీడ్ లో చేసిన యాక్షన్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ సినిమా, ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవుతుంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News