Telangana: ఐదేళ్లు పూర్తి చేసుకున్న ‘షీ టీమ్స్’కు అభినందనలు: మంత్రి కేటీఆర్

  • హైదరాబాద్ లో 2014 అక్టోబర్ 24న ‘షీ టీమ్స్’ను ప్రారంభించారు
  • ఐదేళ్ల కాలంలో 33,700 కేసులను పరిష్కరించింది
  • మహిళల హక్కుల పరిరక్షణకు షీ టీమ్స్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది

హైదరాబాద్ లో ‘షీ టీమ్స్’ ను ఏర్పాటు చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ‘షీ టీమ్స్’ ఐదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుందని అన్నారు. మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలన్న విజన్ తో సీఎం కేసీఆర్ 2014 అక్టోబర్ 24న ‘షీ టీమ్స్’ను ప్రారంభించారని గుర్తుచేశారు.

హైదరాబాద్ లో ‘షీ టీమ్స్’ విజయవంతమైన దృష్ట్యా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ సేవలు విస్తరిస్తామని అన్నారు. ఐదేళ్ల కాలంలో 33,700 కేసులను ‘షీ టీమ్స్’ పరిష్కరించగల్గిందని చెప్పారు. మహిళల హక్కుల పరిరక్షణకు ‘షీ టీమ్స్’ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. నేరస్థులను పట్టుకోవడం, చిన్న నేరస్థులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు అరికట్టడంలో ‘షీ టీమ్స్’ ప్రధాన పాత్ర పోషించాయని ప్రశంసించారు. మహిళల హక్కులకు సంబంధించి వారిని చైతన్య పరచడంతో పాటు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు.

More Telugu News