Nalgonda District: నిండుకుండలా నాగార్జునసాగర్‌.. 12 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల

  • ఇన్‌ఫ్లో బాగా పెరగడంతో అధికారుల నిర్ణయం
  • శ్రీశైలం నుంచి భారీగా వస్తున్న వరద నీరు
  • 2.24 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

కృష్ణమ్మలో వరద ప్రవాహం కొనసాగుతుండడంతో నాగార్జున సాగర్‌ గేట్లను కూడా అధికారులు ఈ ఉదయం ఎత్తారు. మొత్తం 12 గేట్లను ఎత్తి 2 లక్షల 24 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పై నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు శ్రీశైలం డ్యాంకు చెందిన ఏడు గేట్లను 10 అడుగుల మేర ఇప్పటికే ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్‌లోకి 2.24 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. భారీ వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదిలేస్తున్నారు. అలాగే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన 15 గేట్లను కూడా అధికారులు ఎత్తి నీరు దిగువకు వదులుతున్నారు.

More Telugu News