Vijay: 'విజిల్' టీమ్ నుంచి గ్రామీణ క్రికెటర్లకు కానుక

  • ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో సాగే కథ 
  • డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న విజయ్
  • అట్లీ కుమార్ తో మూడో సినిమా

అట్లీ కుమార్ .. విజయ్ కాంబినేషనన్లో తమిళంలో రూపొందిన 'బిజిల్' .. దీపావళి పండుగ కానుకగా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ సినిమాను 'విజిల్' పేరుతో అదే రోజున భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు హైదరాబాదులో ఘనంగా నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి.

ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అందువలన ఈ సినిమా టీమ్, గ్రామీణ ప్రాంతాల్లో ఫుట్ బాల్ క్రీడాభివృద్ధికి తోడ్పడే 'మార్స్' ఫుట్ బాల్ ఫౌండేషన్ ద్వారా 40 మంది బాలబాలికలకు ఫుట్ బాల్ కిట్స్ ను అందించనుంది. విజయ్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికగా నయనతార కనిపించనుంది.

More Telugu News