Indian railway: ఇక ఆ రైళ్లు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడతాయి!

  • ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-కోల్‌కతా మార్గాల్లో పెరగనున్న రైళ్ల వేగం
  • ట్రాక్‌లు, సిగ్నళ్ల ఆధునికీకరణ
  • వెల్లడించిన రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్

ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-కోల్‌కతా మార్గాల్లో ఇక రైళ్ల వేగం పెరగనుంది. ఈ రెండు మార్గాల్లో ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల వేగం సగటున 99 కిలోమీటర్లు కాగా, ఇప్పుడు దానిని 160 కిలోమీటర్లకు పెంచాలని రైల్వే నిర్ణయించింది. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ట్రాక్‌లు, సిగ్నళ్లను ఆధునికీకరించనున్నారు. అలాగే, అందుకు అవసరమైన వనరులను సమకూర్చుకోనున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. కాగా, ఇటీవల ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వేగం 104 కిలోమీటర్లు.

More Telugu News