Tirumala: తిరుమల గిరులు ఖాళీ... మూడు గంటల్లోనే సర్వదర్శనం!

  • నాలుగు కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • సర్వదర్శనానికి మూడు గంటల సమయం
  • ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం

నిత్యమూ భక్తులతో కిటకిటలాడే తిరుమల గిరులు బోసిపోతున్నాయి. స్కూళ్లు తెరచుకోవడం, విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యం, పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో భక్తుల రాక మందగించింది. ఈ ఉదయం స్వామివారి సర్వదర్శనానికి కేవలం నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, వారికి మూడు గంటల వ్యవధిలో దర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు. దివ్య, ప్రత్యేక దర్శనం క్యూలైన్ల భక్తులకు స్వామి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్న 75 వేల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. రూ. 3 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభించిందన్నారు.

More Telugu News